CPI Ramakrishna: సీఐడీ పోలీసుల తీరు దుర్మార్గం.. తెదేపాకి అండగా ఉంటాం: రామకృష్ణ

చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. 

Updated : 11 Sep 2023 15:39 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టు ఊహించని ఘటనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సీఐడీ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉండాలని సూచించారు. ఈ అంశంలో సీపీఐ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలు, ప్రతిపక్ష నేతలపై పోలీసుల దుందుడుకు స్వభావంపై మంగళవారం విజయవాడలో అఖిలపక్షాలు, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని