Kanakamedala: సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలి: కనకమేడల

పోలింగ్‌ రోజు జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుడిని చేస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలని తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు.

Published : 23 May 2024 17:19 IST

అమరావతి: పోలింగ్‌ రోజు జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుడిని చేస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలని తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. హింసాత్మక ఘటనలపై చర్యలు చేపట్టడంలో సీఎస్‌ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. సీఎస్‌ను తొలగించకపోతే కౌంటింగ్‌ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. వైకాపాకు అనుకూలంగా వ్యవహరించే పోలీసులపై ఈసీ విచారణకు ఆదేశించాలని కోరారు. 

సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలింగ్‌ రోజు ఘటనల వీడియోలు బయటపెట్టాలన్నారు. హింసాత్మక ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లోని వీడియోలను విడుదల చేయాలని తెలిపారు. మాచర్ల ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎక్కువ శాతం మంది పోలీసులు ఇప్పటికీ వైకాపా తొత్తులుగా ఉన్నారని ఆక్షేపించారు. అలాంటి పోలీసుల సహకారంతోనే పిన్నెల్లి తప్పించుకున్నారన్నారు. ఘటనకు బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని