Mainpuri By poll: మైన్‌పురి ములాయం కోడలిదే.. డింపుల్‌ ఘన విజయం

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి(Mainpuri) లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి డింపుల్‌ యాదవ్‌ (Dimple Yadav) ఘన విజయం సాధించారు.

Updated : 08 Dec 2022 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party) వ్యవస్థాపకుడు, దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన మైన్‌పురి (Mainpuri) లోక్‌సభ నియోజకవర్గంలో మామ రాజకీయ వారసత్వాన్ని కోడలు డింపుల్‌ యాదవ్ (Dimple Yadav) నిలబెట్టారు. ఈ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక (By polls)ల్లో పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్ సతీమణి డింపుల్‌ ఘన విజయం సాధించారు. గురువారం వెలువడిన ఫలితాల్లో డింపుల్‌.. తన సమీప భాజపా అభ్యర్థి రఘురాజ్‌ సింగ్ శాఖ్యపై 2.40లక్షల భారీ మెజార్టీతో గెలుపొందారు.

ములాయం మరణంతో మైన్‌పురిలో ఉప ఎన్నిక అనివార్యమైంది. 1996 నుంచి మైన్‌పురి.. సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. 1996 ఎన్నికల్లో ములాయం ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత కూడా ఎస్పీ నేతలే ఇక్కడి నుంచి గెలుపొందారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ములాయం మనవడు తేజ్‌ ప్రతాప్‌ సింగ్‌ యాదవ్‌ విజయం సాధించారు. 2019లో మళ్లీ ములాయమే ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది అక్టోబరులో ములాయం కన్నుమూశారు.

44 ఏళ్ల డింపుల్‌ యాదవ్‌ గతంలో 2012 ఉప ఎన్నికలో, 2014 సార్వత్రిక ఎన్నికలో కన్నౌజ్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. 2019లోనూ అక్కడినుంచే పోటీ చేసి.. భాజపా అభ్యర్థి సుబ్రత్ పాఠక్ చేతిలో ఓటమిపాలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని