Eatala Rajender: మాపై దుష్ప్రచారం చేస్తున్నారు: ఈటల ఆగ్రహం

తెలంగాణలో భాజపాపై కొందరు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Eatala Rajendar)మండిపడ్డారు.

Updated : 06 Jul 2023 15:18 IST

హనుమకొండ: తెలంగాణలో భాజపాపై కొందరు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Eatala Rajendar)మండిపడ్డారు. భాజపా, భారాస ఒక్కటయ్యాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌లో జులై 8న ప్రధాని మోదీ సభ నేపథ్యంలో హనుమకొండలో ఈటల మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో భాజపా చాలా బలంగా ఉందని.. చాపకింద నీరులా పార్టీ విస్తరిస్తోందని ఈటల చెప్పారు. ఠక్కున పైకి వెళ్లి పడిపోవడానికి.. భాజపా బలమేమీ సెన్సెక్స్‌ కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తమ విజయపరంపర 2019 ఎంపీ ఎన్నికలతో మొదలైందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటామని చెప్పారు. మునుగోడులోనూ నైతికంగా భాజపానే గెలిచిందన్నారు. ప్రధాని పర్యటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారని తెలిపారు. పార్టీ యంత్రాంగమంతా ప్రధాని సభను విజయవంత చేస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని