Eatala Rajender: ముదిరాజ్‌లకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి: ఈటల రాజేందర్‌

ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భాజపా నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Published : 08 Oct 2023 21:38 IST

హైదరాబాద్: ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భాజపా నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మత్స్యకారుల కోసం రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముదిరాజ్‌లకు భారాస ఒక్క సీటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్‌ల ఆత్మ గౌరవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో ముదిరాజులు 11శాతం ఉన్నారని రాజకీయంగా ఆదరణ మాత్రం కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. 

జనాభా దామాషా ప్రకారం.. అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్‌లకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలన్నారు. బీసీలకు 9 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం ముగ్గురికి మాత్రమే ఇవ్వడంపై ఈటల ధ్వజమెత్తారు. ‘ఓట్లు మావే సీట్లు మావే’ అనే నినాదాం ఇవ్వాలని ముదిరాజులకు పిలుపునిచ్చారు. పదేళ్లుగా ఆదివాసులకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. సభకు వస్తున్న ముదిరాజ్‌లకు ప్రభుత్వ పథకాలు అందవని భయపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని లెక్క చేయకుండా సభకు వచ్చి విజయవంతం చేసిన వారికి ఈటల ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని