Eatala Rajender: పదేళ్లలో భారాస ఉద్యోగాలు కల్పించలేకపోయింది: ఈటల రాజేందర్‌

పదేళ్లలో భారాస ఉద్యోగాలు కల్పించలేకపోయిందని భాజపా నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు.

Published : 25 May 2024 12:12 IST

ఇల్లందు: పదేళ్లలో భారాస ఉద్యోగాలు కల్పించలేకపోయిందని భాజపా నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని భారాస ఇప్పుడెలా చేస్తుందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి పట్టాయన్నారు. కాంగ్రెస్‌ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మాత్రమే అమలవుతోందని చెప్పారు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈటల రాజేందర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని