Eatala Rajender: విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి ప్రభుత్వమే నెట్టింది: ఈటల

విద్యుత్ కంపెనీలు రూ.10 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల అప్పుల ఊబిలోకి వెళ్లాయని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

Published : 13 Aug 2023 19:39 IST

హనుమకొండ: విద్యుత్ కంపెనీలు రూ.10 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల అప్పుల ఊబిలోకి వెళ్లాయని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ మొదటి రాష్ట్ర మహాసభలో ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి ప్రభుత్వమే నెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వ బకాయిలతోనే విద్యుత్ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయన్నారు. ఆర్టిజన్స్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ సౌకర్యాలు అందుతాయో అదే తరహాలో ఆర్టిజన్స్‌కు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఈటల ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని