Eatala Rajender: మహిళపై పోలీసుల దాడి.. ఇద్దరిని సస్పెండ్‌ చేసి సరిపెట్టారు: ఈటల రాజేందర్

రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని దళిత, గిరిజన మహిళలపై ప్రభుత్వం దాడులు చేయించడం తగదని భాజపా నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

Updated : 19 Aug 2023 20:10 IST

హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని దళిత, గిరిజన మహిళలపై ప్రభుత్వం దాడులు చేయించడం తగదని భాజపా నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మహిళపై దాడి ఘటనలో కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత, గిరిజన మహిళలపై దాడులు చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని మండిపడ్డారు.

‘‘గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో మరియమ్మ అనే దళిత మహిళపై దాడి చేసి చంపారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేసి బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసినా ఫలితం శూన్యం. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన ఘటన, కరీంనగర్ జిల్లాలోనూ హింస చూశాం. అవన్నీ ప్రజలు లెక్కపెట్టుకుంటున్నారు. దళితబంధు పథకం కింద 2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తామని సర్కారు హామీ ఇచ్చిన నేపథ్యంలో సాయం చేయాలంటూ ఆందోళన చేస్తే సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లో దళితబస్తీలో జనాలను భయపెట్టే యత్నం చేశారు’’ అని ఈటల ఆరోపణలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని