Eatala Rajender: కేసీఆర్‌పై పోటీ చేస్తానని.. ఆషామాషీగా చెప్పలేదు: ఈటల

సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదని.. కచ్చితంగా చేసి తీరుతానని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, భాజపా నేత ఈటల రాజేందర్‌ వెల్లడించారు.

Updated : 16 Oct 2023 13:14 IST

జమ్మికుంట: సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదని.. కచ్చితంగా చేసి తీరుతానని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, భాజపా నేత ఈటల రాజేందర్‌ వెల్లడించారు. జమ్మికుంటలో జరగనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌ చేసిన సవాల్‌పై ఆయన స్పందించారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు రూ.100 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యం చేసినా.. అధికార యంత్రాంగం మొత్తాన్ని తనపై కేంద్రీకరించినా గెలిచానని వివరించారు. ఆ ఉపఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ను ఓడించటమే తన లక్ష్యమని చెప్పారు. ఆ మేరకే గజ్వేల్‌ నుంచి పోటీ చేయనున్నట్టు ఈటల స్పష్టం చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని