loksabha polls: గయ ఎన్డీయే అభ్యర్థి జితన్ రామ్ మాంఝీ చరాస్తుల విలువ రూ.11.32 లక్షలు

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ వ్యవస్థాపకుడు జితన్ రామ్ మాంఝీ గయా స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాగా అతడు దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం జితన్‌ రామ్‌ వద్ద రూ.11.32 లక్షల విలువైన చరాస్తులు, రూ.49,000 నగదు ఉన్నట్లుగా తెలిపారు. 

Published : 30 Mar 2024 19:13 IST

పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ (హెచ్‌ఎఎం-ఎస్) వ్యవస్థాపకులు జితన్ రామ్ మాంఝీ గయా స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అతడు ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన అఫిడవిట్‌లో జితన్‌ రామ్‌ వద్ద రూ.11.32 లక్షల విలువైన చరాస్తులు, రూ.13.50 లక్షల స్థిరాస్తులు, రూ.49,000 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. చరాస్తుల్లో నాలుగు బ్యాంకు ఖాతాలు, రెండు నాలుగు చక్రాల వాహనాలు, ఒక డీబీబీఎల్‌ తుపాకీ, రెండు ఆవులు ఉన్నట్లు అందులో చూపించారు.

బిహార్‌లోని గయా, నవాడ, జాముయి, ఔరంగాబాద్‌లలో మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి. ఈనేపథ్యంలో గయా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగడానికి మాంఝీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో భార్య శాంతిదేవికి ఒక బ్యాంకు ఖాతా, రూ.3.78 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.76,500 వెండి ఆభరణాలు, రూ.13.50లక్షల విలువైన ఇంటిని కలిగిఉన్నట్లు తెలిపారు. 

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గయ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థి కుమార్ సర్వజీత్‌తో పోటీపడనున్నారు. 2014లో మాంఝీ జేడీ(యు) అభ్యర్థిగా గయ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2019లోను తన సొంత పార్టీ గుర్తుపై పోటీ చేసినా కూడా 1.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని