Srinivas Goud: తాత్కాలికంగా నా గొంతును ఆపగలరు.. కానీ..: మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌, భాజపా నాయకులు ఒక్కటై తనను ఓడించారని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. 

Published : 08 Jan 2024 18:21 IST

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌, భాజపా నాయకులు ఒక్కటై తనను ఓడించారని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే.. 10 రోజుల్లో వచ్చిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎలా గెలిచారో ప్రజలు ఆలోచించాలని కోరారు. తాను భూములు కబ్జా చేశానని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.

‘‘తాత్కాలికంగా నా గొంతును ఆపగలరు కానీ, భవిష్యత్తులో ఆపలేరు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు భారాస ప్రభుత్వం స్థలం, నిధులు కేటాయించింది. ఆగస్టులో పాపన్న గౌడ్ జయంతి నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహ ఏర్పాటును పూర్తి చేయాలి. కుల వృత్తుల కోసం ఏర్పాటు చేసిన ఆత్మగౌరవ భవనాలను కూడా పూర్తి చేయడంతోపాటు వైన్స్, మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ వర్గానికి చెందిన వారికి 25 శాతం కేటాయించాలి. భారాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులను నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో పూర్తి చేయాలి’’ అని శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని