TDP: వైకాపా పాలనతో దోపిడీ పెరిగిపోయింది: మురళీమోహన్‌

ఐదేళ్లుగా ఏపీ వెనుకబడిపోయిందని తెదేపా నేత, మాజీ ఎంపీ మురళీమోహన్‌ అన్నారు.

Updated : 21 Mar 2024 16:23 IST

హైదరాబాద్‌: ఐదేళ్లుగా ఏపీ వెనుకబడిపోయిందని తెదేపా నేత, మాజీ ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. రాజధాని లేక రాష్ట్రం దిక్కులేనిదిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ‘హోరెత్తిన ప్రజాగళం’ గీతాన్ని పార్టీ నేతలు టీడీ జనార్దన్‌, జ్యోత్స్న తిరునగరి, శ్రీనివాసరావు పొట్లూరి తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మురళీమోహన్‌ మీడియాతో మాట్లాడారు. 

‘‘వైకాపా పాలనతో ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. దోపిడీ పెరిగిపోయింది. ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం.. అన్ని రంగాల్లో వెనుకబడేందుకు కారణమైంది. ఉచితాల వల్ల ప్రయోజనం ఉండదు. దాని బదులు ఉపాధి మార్గం చూపితే ప్రజల జీవితం మెరుగుపడుతుంది. చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ మళ్లీ గాడిలో పడుతుంది.’’ అని మురళీమోహన్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు