‘ఓట్లు వేసే వరకే ఉత్తమ్‌ దుబ్బాకలో ఉంటారు’

ఓట్లు వేసే వరకే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దుబ్బాకలో ఉంటారని.. ఓట్లు అయిపోయినా ఇక్కడి ప్రజల మధ్య ఉండేది తెరాసనే అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు నర్సింహారెడ్డి, మనోహర్‌ రెడ్డి, మరికొంత..

Updated : 12 Oct 2022 15:58 IST

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

దుబ్బాక: ఓట్లు వేసే వరకే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దుబ్బాకలో ఉంటారని.. పోలింగ్‌ అయిపోయినా ఇక్కడి ప్రజల మధ్య ఉండేది తెరాసనే అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు నర్సింహారెడ్డి, మనోహర్‌ రెడ్డి, మరికొంత మంది కాంగ్రెస్‌ నేతలు హరీశ్‌రావు సమక్షంలో తెరాసలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు. ఓట్ల కోసం వచ్చేవాళ్లకు ఓటేద్దామా? లేక కష్టసుఖాల్లో కలిసుండే వారికి ఓటు వేద్దామా? అనే విషయాన్ని ప్రజలను ఆలోచించాలన్నారు. భర్తను కోల్పోయిన మహిళను అసమర్థురాలు అని ఉత్తమ్‌ ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా దుబ్బాక మహిళా లోకాన్ని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కించపరిచారని అన్నారు. దుబ్బాకలో తొలిసారి ఓ మహిళ ఎమ్మెల్యే అవుతుందని అందరూ సంతోషిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని