Vizag: స్టేషన్‌ బెయిల్‌పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల

మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పోలీసులు స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. 

Updated : 09 Sep 2023 21:25 IST

విశాఖపట్నం: మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పోలీసులు స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. శనివారం తెల్లవారుజామున విశాఖలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని ఎండాడలోని దిశ పోలీసు స్టేషన్‌కు తరలించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో మందస్తుగా పోలీసులు గంటాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం తెదేపా నేతల బృందం.. విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్‌ను కలవనున్నారు. ఈ బృందంలో గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని