విశాఖ ఉక్కు కోసం రాజీనామా చేసిన ఏకైక ఎమ్మెల్యే గంటా: కార్మిక సంఘాలు

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోసం భవిష్యత్‌ కార్యాచరణపై పోరాట కమిటీ సభ్యులతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు.

Published : 26 Jan 2024 18:26 IST

విశాఖపట్నం: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోసం భవిష్యత్‌ కార్యాచరణపై పోరాట కమిటీ సభ్యులతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌ ఆమోదించిన తర్వాత తొలిసారి నాయకులతో భేటీ అయ్యారు. పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. 57 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు, 32 మంది అమరవీరుల ప్రాణ త్యాగం, భూ నిర్వాసితుల త్యాగ ఫలితంగానే స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం జరిగిందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట్రంలో రాజీనామా చేసిన ఏకైక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అని తెలిపారు. చరిత్రలో త్యాగధనుల పేర్లు సజీవంగా నిలిచి ఉంటాయన్నారు.

గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ...‘‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేవలం పరిశ్రమగానే చూడకూడదు. ఆ సంస్థ విశాఖ ముఖచిత్రాన్నే మార్చేసింది. అలాంటి పరిశ్రమను వంద శాతం విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి పెడితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. తెదేపా, జనసేన మేనిఫెస్టోలో స్టీల్‌ప్లాంట్‌ అంశాన్ని పెడతాం’’ అని వివరించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పల్లా శ్రీనివాస్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని