Ganta Srinivasa Rao: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ జగన్‌కు గుర్తుంది: గంటా శ్రీనివాసరావు

రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.

Published : 24 Jan 2024 13:48 IST

విశాఖ: రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖలో ఆయన మాట్లాడారు. ‘‘తనపై ఉన్న కేసుల వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం ప్రధానితో జగన్‌ మాట్లాడలేదు. ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్‌ప్లాంట్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కోసం 2021 ఫిబ్రవరిలో స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేశా. దీనిని ఆమోదించాలని గతంలో పలుసార్లు స్పీకర్‌ను కోరా.

ఉప ఎన్నిక భయంతోనే ఇన్నాళ్లు ఆమోదించలేదు. రాజ్యసభ ఎన్నికల కోసమే ఇప్పుడు ఆమోదించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ జగన్‌కు గుర్తుంది. రాజీనామాలే కాదు.. అంతకు మించిన త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం. సీఎం జగన్‌ విలువలకు పాతర వేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై వైకాపా ఎంపీలు కేంద్రాన్ని నిలదీయగలరా? జగన్‌ పరిపాలనపై వైకాపా నేతలూ చాలా అసంతృప్తిగా ఉన్నారు. నా రాజీనామా ఆమోదం.. వైకాపాకు చెల్లుచీటీ’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని