Ganta Srinivasarao: జగన్‌ ఘనకార్యాలకు ఈ ఒక్క ఫొటో చాలు.. గంటా సెటైరికల్‌ ట్వీట్‌

ఏపీ సీఎం జగన్‌పై తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు. ‘వై ఏపీ హేట్స్‌ జగన్‌’ అంటూ ఓ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో ఆయన పోస్ట్‌ చేశారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. 

Updated : 15 Nov 2023 12:01 IST

విశాఖపట్నం: ఏపీ సీఎం జగన్‌పై తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు. ‘వై ఏపీ హేట్స్‌ జగన్‌’ అంటూ ఓ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో ఆయన పోస్ట్‌ చేశారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. 

‘‘జగన్‌మోహన్‌రెడ్డి గారూ.. ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో మీరు చేసిన ఘన కార్యాలకు ఈ ఒక్క చిత్రం సరిపోతుంది. ప్రజలు ‘ఏపీ హేట్స్‌ జగన్‌’, ‘వద్దు వద్దు.. ఈ జగన్’ ‘మళ్లీ మా కొద్దు ఈ జగన్‌’ అని ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ గారూ?’’ అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

వైకాపా నేతలు ఏపీకి జగనే ఎందుకు కావాలి అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సెటైరికల్‌గా గంటా శ్రీనివాసరావు ఈ పోస్టర్‌ను ట్విటర్‌(ఎక్స్‌)లో షేర్‌ చేశారు. 

గంటా శ్రీనివాసరావు షేర్‌ చేసిన పోస్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు