Ganta Srinivasarao: ‘ఇస్తాం.. చేస్తాం.. తెస్తాం.. జగనన్న ఎగ్గొట్టిన హామీల లిస్ట్‌ ఇదీ..’

‘‘ఇస్తాం.. చేస్తాం.. తెస్తాం.. కడతాం..’’  అని చెప్పడం తప్ప సీఎం జగన్‌ చేసిందేమీ లేదని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.

Updated : 11 Dec 2023 12:12 IST

మాజీ మంత్రి గంటా ట్వీట్‌

విశాఖపట్నం: ‘‘ఇస్తాం.. చేస్తాం.. తెస్తాం.. కడతాం..’’  అని చెప్పడం తప్ప సీఎం జగన్‌ చేసిందేమీ లేదని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. జగన్‌ మాట తప్పి మడమ తిప్పారని.. హామీలు ఎగ్గొట్టారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయిన సందర్భంగా ‘జగనన్న ఎగ్గొట్టిన హామీల లిస్టు’ పేరుతో ఆ జాబితాను గంటా శ్రీనివాసరావు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా పోస్ట్‌ చేశారు. వీటిలో సీపీఎస్‌ రద్దు, ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి చేయడం తదితర ముఖ్య హామీలు ఉన్నాయి. ఇవి టాప్‌ 50 మాత్రమేనని.. ప్రాముఖ్యత తక్కువ ఉన్న హామీలను బయటకు తీస్తే ఈ జాబితాకు మరో మూడింతలు అవుతుందన్నారు.

‘‘మీ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడంలో చతికిలపడింది. మీరు చెప్పిన సంక్షేమం సంక్షోభంలో పడింది. మీ అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ సారి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. మీ ప్రభుత్వానికి దుకాణం సర్దుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి జగన్‌ మోహన్‌రెడ్డి గారు.. బై జగన్... బై బై జగన్..’’ అంటూ గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని