Ganta Srinivas Rao: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో గంటా శ్రీనివాసరావు అరెస్టు

తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టు అయ్యారు. స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. 

Updated : 09 Sep 2023 11:20 IST

విశాఖ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ తెల్లవారుజామునే విశాఖలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఎండాడలోని దిశ పోలీసు స్టేషన్‌కు ఆయణ్ని తరలించారు. 

ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో మూడు గంటల హైడ్రామా అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. రోడ్డు మార్గంలో చంద్రబాబును సీఐడీ కార్యాలయానికి పోలీసులు తరలించే అవకాశం ఉంది.    


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని