Ganta srinivasarao: ‘ఈసీ చెప్పిన దొంగ ఓట్లు మీవేనా జగన్‌ గారూ?’: గంటా

ఎన్నికల సంఘం చెప్పిన దొంగ ఓట్లు మీవేనా జగన్‌ గారూ అంటూ మాజీ మంత్రి, తెదేపా నేత గంటా శ్రీనివాసరావు ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు.

Published : 13 Sep 2023 18:00 IST

విశాఖపట్నం: ఎన్నికల సంఘం చెప్పిన దొంగ ఓట్లు మీవేనా జగన్‌ గారూ అంటూ మాజీ మంత్రి, తెదేపా నేత గంటా శ్రీనివాసరావు ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. మా ఓటర్లు వేరే ఉన్నారు అంటే ఏంటో అనుకున్నాము.. ఎన్నికల సంఘం 27లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పింది వీరేనా అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ ధైర్యంతోనే 175కి 175 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారా? అని ప్రశ్నించారు.

‘‘రాష్ట్రంలో జీరో హౌస్‌ నెంబర్‌తో 2,51,767 ఓట్లు, ఒకే డోర్‌ నెంబరుతో 10 ఓట్లకు పైగా ఉన్న ఇళ్లు 1,57,939. ఒకే డోర్‌ నెంబర్‌తో 24,61,676 ఓట్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికారులపై అజమాయిషీ చేస్తూ.. సాంకేతికంగా ఎక్కడా దొరక్కుండా వాలంటీర్ల సాయంతో అతిపెద్ద మోసానికి తెరలేపారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి సృష్టించి ప్రజలందరూ ఆ గొడవలో ఉంటే మీరు మాత్రం దొంగ ఓట్లు సృష్టించడంలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గాల వారీగా దొంగ ఓటర్ల లెక్కలు బయటపడాలి. దొంగ ఓటర్లతో పాటు ప్రోత్సహించిన వారికి, సహకరించిన వారికి కూడా శిక్షలు పడాలి. అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. రాష్ట్రంలో వైకాపాకు చెల్లుచీటి పడిపోయింది. ఈరోజు నుంచి కౌంట్‌ డౌన్‌ మొదలైంది’’ అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని