అవినాష్‌రెడ్డిని కాపాడటానికి జగన్‌ విశ్వప్రయత్నాలు: చంద్రబాబు

‘వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారిస్తుండటంతో సీఎం జగన్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నిందితుల్ని కాపాడటానికి ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు’ అని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Published : 29 Jan 2023 05:14 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ‘వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారిస్తుండటంతో సీఎం జగన్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నిందితుల్ని కాపాడటానికి ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు’ అని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైకాపా నేత, దుగ్గిరాల మాజీ ఎంపీపీ వెనిగెళ్ల కృష్ణప్రసాద్‌ తెదేపాకార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. దుగ్గిరాల మండలానికి చెందిన 100 మంది వైకాపా కార్యకర్తలు, కృష్ణాయపాలెం, ఉండవల్లి, తుమ్మపూడి గ్రామాలకు చెందిన ఎస్సీ, మైనారిటీ నాయకులూ తెదేపా కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘జగన్‌ చేతిలో అధికారం.. పిచ్చోడి చేతిలో రాయీ ఒకటే. ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన ఆయన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైకాపా ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలి. తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాల్నీ జగన్‌ రద్దు చేశారు. రాష్ట్రం కోసం, తమ భవిత కోసం యువత బయటకు రావాలి. సైకో పాలకుల చేతిలో రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని