కొలీజియంలో కేంద్ర ప్రతినిధి నియామకం సరికాదు

న్యాయమూర్తుల ఎంపిక బృందమైన కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని నియమించడం సరికాదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

Published : 31 Jan 2023 03:13 IST

తమిళనాడు సీఎం స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: న్యాయమూర్తుల ఎంపిక బృందమైన కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని నియమించడం సరికాదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఇది న్యాయశాఖ స్వేచ్ఛకు అడ్డుపడేలా ఉందన్నారు. ఇది హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సామాజిక న్యాయం ప్రాతిపదికన న్యాయమూర్తుల ఎంపిక విధానానికి రవ్వంతైనా సహకరించదని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు వెలువడటంపై హర్షం వ్యక్తం చేశారు. మద్రాసు హైకోర్టులో వాదనలు తమిళంలో సాగాలని, సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రంలో ఏర్పాటు కావాలన్న తమ డిమాండ్లకు ఇది తొలి మెట్టుగా భావిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పాన్‌ మసాల, గుట్కా తదితర మత్తుపదార్థాల నిషేధ ఉత్తర్వులను హైకోర్టు తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో తమ ప్రభుత్వం అప్పీల్‌ చేయనుందని పేర్కొన్నారు. శ్రీలంకలోని తమిళులు ఆశించేలా అధికార పంపిణీ జరగాలన్నది తమ వైఖరిగా వెల్లడించారు. జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో డీఎంకే ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తుతారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని