Ponguleti: ఏడున్నరేళ్లుగా ఇబ్బందులు పెట్టారు: పొంగులేటి

అధికారం ఎవరి సొత్తూ కాదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లులో సోమవారం నిర్వహించిన మధిర నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

Updated : 31 Jan 2023 08:42 IST

బోనకల్లు, న్యూస్‌టుడే: అధికారం ఎవరి సొత్తూ కాదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లులో సోమవారం నిర్వహించిన మధిర నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కొందరు నాయకులు ఏడున్నరేళ్లుగా తనను, తన అనుచరులను ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస(భారాస) అభ్యర్థులు ప్రజావ్యతిరేకత, స్వయంకృతాపరాధంతో ఓడిపోయారని.. కానీ, తాను ఓడించానని చెప్పి తనపై కక్షకట్టారని చెప్పారు. సిట్టింగ్‌ ఎంపీ అయినా తనకు సీటు ఇవ్వలేదన్నారు. తాను ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా శుభకార్యాలకు వెళ్లాలన్నా, ఎవరినైనా పరామర్శించాలన్నా స్థానిక ప్రజాప్రతినిధుల అనుమతి తీసుకోవాలంటూ ఆంక్షలు విధించారని వాపోయారు. తన ఆవేదనను చెప్పుకొనే అవకాశం కేసీఆర్‌ ఇవ్వలేదన్నారు. ఇన్ని అవమానాలతో పనిచేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని