కృష్ణా జలాల్లో వాటా కోసం కేసీఆర్ ఏనాడైనా దిల్లీ వచ్చారా?: కోదండరాం
ఆర్థిక, వ్యాపార, సొంత ప్రయోజనాల కోసమే ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వస్తున్నారని.. ఆయన ఏనాడైనా కృష్ణా నదీ జలాల్లో వాటా కోసం వచ్చారా అని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు.
ఈనాడు, దిల్లీ: ఆర్థిక, వ్యాపార, సొంత ప్రయోజనాల కోసమే ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వస్తున్నారని.. ఆయన ఏనాడైనా కృష్ణా నదీ జలాల్లో వాటా కోసం వచ్చారా అని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. కృష్ణాజలాల్లో రాష్ట్ర వాటా, విభజన హామీలపై దిల్లీలోని జంతర్‌మంతర్‌లో తెజస ఆధ్వర్యంలో సోమవారం మౌనదీక్ష చేపట్టారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. కీలకమైన నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందన్నారు. హైదరాబాద్‌లోని జంట జలాశయాలను ఉపయోగించుకోవడం లేదని, అవి ఎండిపోతే 111 జీవో ఎత్తివేసి స్థిరాస్తి వ్యాపారం చేసుకోవచ్చని యోచిస్తోందని ఆరోపించారు. విభజన అనంతరం తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు కేటాయించినా..179 టీఎంసీలే రాష్ట్రానికి దక్కుతున్నాయన్నారు. చెరువుల్లో నీటిని కృష్ణా జలాలుగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైబ్యునల్ వేసి రెండు రాష్ట్రాల మధ్య నీటివాటా తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Ts-top-news News
నేటి నుంచి బీఎస్-6.2 నిబంధన అమలు
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కొత్త టోల్ఛార్జీలు
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!