కశ్మీరీ పండిట్ల దురవస్థ చూడండి..

తమ భద్రతకు భరోసా లేకుండా కశ్మీర్‌లో పనిచేసేందుకు రాలేమని చెబుతున్న కశ్మీరీ పండిట్‌ ఉద్యోగుల దురవస్థను ప్రధాన మంత్రి మోదీ చూడాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కోరారు.

Published : 04 Feb 2023 04:53 IST

ప్రధాని మోదీకి రాహుల్‌ లేఖ

దిల్లీ: తమ భద్రతకు భరోసా లేకుండా కశ్మీర్‌లో పనిచేసేందుకు రాలేమని చెబుతున్న కశ్మీరీ పండిట్‌ ఉద్యోగుల దురవస్థను ప్రధాన మంత్రి మోదీ చూడాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కోరారు. వారి పట్ల అక్కడి కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని  తప్పుపడుతూ మోదీకి లేఖ రాశారు. ఇటీవల కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు హత్యలకు తెగబడుతుండడంతో భయానక వాతావరణం నెలకొందని తెలిపారు.

కాంగ్రెస్‌ నుంచి అమరీందర్‌ సతీమణి సస్పెన్షన్‌

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ సతీమణి, ఎంపీ పర్‌నీత్‌ కౌర్‌.. కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ అయ్యారు. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఈ చర్య తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని