గవర్నర్‌ ఎందుకు యూ టర్న్‌ తీసుకున్నారో ప్రజలకు చెప్పాలి: మల్లు రవి

గవర్నర్‌ తమిళిసై ఎందుకు యూ టర్న్‌ తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

Published : 04 Feb 2023 04:53 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: గవర్నర్‌ తమిళిసై ఎందుకు యూ టర్న్‌ తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గవర్నర్‌ అసెంబ్లీలో చదివిన ప్రసంగమంతా.. నిన్నటి వరకు ఆమె మాట్లాడిన దానికి, పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు. ‘రాష్ట్రంలో ఫామ్‌హౌజ్‌లు, సెక్రటేరియట్‌లు కట్టడమే అభివృద్ధికి సూచికలు కాదని రిపబ్లిక్‌ డే నాటి ప్రసంగంలో పేర్కొన్న గవర్నర్‌.. శాసనసభలో మాత్రం తెలంగాణ సమగ్ర సమ్మిళిత అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది’ అని చెప్పారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని