లోకేశ్‌, తెదేపా నేతలపై కేసులు

చిత్తూరు జిల్లా పలమనేరులో ఈనెల 2వ తేదీన తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర నిర్వహించారు.

Updated : 06 Feb 2023 06:13 IST

పలమనేరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పలమనేరులో ఈనెల 2వ తేదీన తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా పట్టణంలో అనుమతి లేకుండా వాహనం పైకెక్కి మాట్లాడినందుకు పోలీసులు మాజీమంత్రి అమరనాథరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఐపీసీ 188, 290, 34, 314 సెక్షన్ల కింద లోకేశ్‌, అమరనాథరెడ్డితో పాటు మరికొందరిపై కేసులు పెట్టినట్లు సీఐ చంద్రశేఖర్‌ ఆదివారం తెలిపారు. బంగారుపాళ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు, అనుమతి లేకుండా ప్రచారవాహనం వినియోగించినందుకు పోలీసులు లోకేశ్‌, తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సుధాకరరెడ్డి తెలిపారు. తోపులాటలో తెదేపా నాయకులు ఎన్పీ ప్రకాష్‌, జగదీష్‌, కోదండ మరి కొందరిపై కేసులు నమోదుచేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని