అదానీకి మనం ఏమౌతాం ?

అదానీ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ తన దాడిని విస్తృతం చేసింది. వివాదంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం నిశ్శబ్దం పాటిస్తోందని ఆరోపించింది.

Updated : 06 Feb 2023 05:52 IST

మోదీపై కాంగ్రెస్‌ ప్రశ్నల దాడి

దిల్లీ: అదానీ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ తన దాడిని విస్తృతం చేసింది. వివాదంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం నిశ్శబ్దం పాటిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో అదానీ మహా మెగా కుంభకోణం తమను ‘అదానీకి మనం ఏమౌతాం/హెచ్‌ఏహెచ్‌కే’? పేరిట ప్రధాని మోదీపై ప్రశ్నల పరంపరను సంధించేలా చేసిందని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈ రోజు నుంచి ప్రతి రోజూ ప్రశ్నలు వేయనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ఆర్థిక అవకతవకలపై పనామా, పండోరా పత్రాల్లో ప్రాచుర్యంలోకి వచ్చిన గౌతం అదానీ సోదరుడైన వినోద్‌ అదానీకి చెందిన సంస్థకు సంబంధించిన వాస్తవ విషయాలు ఏమిటి? అదానీ గ్రూప్‌పై సంవత్సరాల క్రితం వచ్చిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారు? ప్రధానమంత్రి పర్యవేక్షణలో న్యాయమైన, నిష్పాక్షికమైన దర్యాప్తును ఆశించవచ్చా? దేశంలోని భారీ పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన ఓ సంస్థను విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మాణాల్లో గుత్తాధిపత్యం ఎలా కట్టబెట్టారు? ఆ సంస్థపై వచ్చిన ఆరోపణలు తీక్షణ పరిశీలన నుంచి తప్పించుకున్నాయా?’’ అని రమేశ్‌ నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు