సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడైనా ఉండొచ్చు..

ఏపీ సీఎం తన క్యాంపు కార్యాలయాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చని, అందులో ఎలాంటి అభ్యంతరం లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

Updated : 06 Feb 2023 06:20 IST

రానున్న ఎన్నికల్లో ఏపీలో జనసేనతో పొత్తు ఉంటుంది
భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఏపీ సీఎం తన క్యాంపు కార్యాలయాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చని, అందులో ఎలాంటి అభ్యంతరం లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో భాజపా పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాలతో దేశం ఆర్థిక ప్రగతి వైపు పరుగులు తీస్తోందని అన్నారు. ఆదివారం విశాఖలో కేంద్ర బడ్జెట్‌పై మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎల్‌ మాట్లాడారు. ‘‘కరోనా తరువాత ప్రపంచ దేశాలన్నీ కుదేలయ్యాయి. అలాంటి స్థితిలో ప్రధాని రూ.45 లక్షల కోట్ల బడ్జెట్‌తో దేశ ఆర్థికాన్ని మరో దశకు తీసుకెళుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు వివిధ రూపాల్లో వస్తున్నాయి. రాష్ట్రంలోని రైల్వేలు, ఇతర ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడం హర్షణీయం. లోకేశ్‌ పాదయాత్రతో ఎలాంటి ఉపయోగం లేదు’’ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళుతుంటే, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్లు నొక్కుతూ రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేస్తున్నారని విమర్శించారు. 2024లో జగన్‌ను ఇంటికి పంపించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని