తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య

మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య మంగళవారం హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో  చేరారు. ఆయన గతంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా, తుడా ఛైర్మన్‌గా పనిచేశారు.

Published : 08 Feb 2023 04:17 IST

ఈనాడు, అమరావతి: మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య మంగళవారం హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో  చేరారు. ఆయన గతంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా, తుడా ఛైర్మన్‌గా పనిచేశారు. తెదేపా ప్రభుత్వంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఆకాంక్షించారు. మునిరామయ్యతో పాటు ఆయన కుమారుడు, వైకాపా రాష్ట్ర యూత్‌ జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌, మరో 22 మంది వైకాపా నేతలు కూడా తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వైకాపా విధ్వంస పాలన నిరసిస్తూ వీరంతా ఆ పార్టీ వీడారని శ్రీకాళహస్తి తెదేపా ఇన్‌ఛార్జి బొజ్జల సుధీర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని