జేపీసీపై తగ్గం.. క్షమాపణ చెప్పం..
అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని నియమించాలన్న డిమాండుపై వెనక్కి తగ్గేదే లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ స్పష్టంచేశారు.
జైరాం రమేశ్ స్పష్టీకరణ
దిల్లీ: అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని నియమించాలన్న డిమాండుపై వెనక్కి తగ్గేదే లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ స్పష్టంచేశారు. తమ అగ్రనేత రాహుల్‌గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రశ్నే తలెత్తదని తేల్చిచెప్పారు. ఈ పరిస్థితుల్లో.. పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభన వీడే మార్గం కనిపించడం లేదన్నారు. జేపీసీ కోసం 16 విపక్షాలు మూకుమ్మడిగా డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కదిలిపోతోందనీ, అందుకే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు. ‘‘చైనా, జర్మనీ, దక్షిణ కొరియా సహా వివిధ దేశాల్లో ప్రధాని నరేంద్రమోదీ గతంలో పలుమార్లు చేసిన ప్రసంగాల్లో దేశ అంతర్గత అంశాలు లేవనెత్తారు. అలాంటిది మన దేశంలో ప్రస్తుతం నెలకొన్న అప్రకటిత అత్యయిక పరిస్థితి గురించి రాహుల్ ప్రస్తావిస్తే దానికి క్షమాపణలు ఎందుకు చెప్పాలి? విదేశాలు జోక్యం చేసుకోవాలని రాహుల్ చెప్పారనడం అర్థరహితం. ఆయన ఏం చెప్పారో వీడియోల్లో ఉంటుంది. దేశ అంతర్గత విషయాలను అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని రాహుల్ చెప్పారు. దానిపై భాజపా అబద్ధపు ప్రచారం చేస్తోంది. చేయని వ్యాఖ్యల్ని ఆయనకు ఆపాదిస్తోంది’’ అని ఆరోపించారు. అధికార పక్షమే సభను వాయిదా వేయిస్తోందన్నారు.
నడ్డా నివాసం వెలుపల మహిళా కాంగ్రెస్ నిరసన
తమ అగ్రనేత రాహుల్‌గాంధీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నివాసం ఎదుట దిల్లీ మహిళా కాంగ్రెస్ నేతలు శనివారం నిరసన తెలిపారు. పలువురు నాయకురాళ్లను పోలీసులు నిర్బంధంలో తీసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
UP: ‘నన్ను ఎన్కౌంటర్ చేస్తారు’.. భయం మధ్యే గ్యాంగ్‌స్టర్ యూపీకి తరలింపు
-
Sports News
Shikhar Dhawan : నేను పెళ్లి విషయంలో ఫెయిలయ్యాను.. : శిఖర్ ధావన్
-
Movies News
Nagababu: పవన్‌కు ఇచ్చే గొప్ప బహుమతి అదే..: చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగబాబు కామెంట్స్
-
Sports News
TATA IPL 2023: ఐపీఎల్ వ్యాఖ్యాతగా నందమూరి బాలకృష్ణ
-
Politics News
Azad: రాహుల్‌పై వేటు: ఇలాగైతే.. పార్లమెంట్, అసెంబ్లీలు ఖాళీయే: ఆజాద్
-
Sports News
MIW vs DCW: ముగిసిన దిల్లీ ఇన్నింగ్స్.. ముంబయి లక్ష్యం 132