ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపడం జగన్‌ విధానం

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపడం ముఖ్యమంత్రి జగన్‌ విధానమని, ఇప్పటివరకు అలాగే ఎన్నికలు నిర్వహించామని పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Published : 20 Mar 2023 04:35 IST

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపడం ముఖ్యమంత్రి జగన్‌ విధానమని, ఇప్పటివరకు అలాగే ఎన్నికలు నిర్వహించామని పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో అన్ని శక్తులూ కలిస్తే తెదేపా అభ్యర్థులు గెలిచారని, దాన్ని చూసి చంద్రబాబు జబ్బలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సచివాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘గతంలో నంద్యాల ఉపఎన్నికలు చూసి తెదేపా నేతలు ఇలాగే విర్రవీగారు. తర్వాత వచ్చిన సాధారణ ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడూ అంతే. అప్పట్లో సమిట్‌లో చంద్రబాబు, వెంకయ్య మాత్రమే వేదిక మీద కూర్చున్నారు. ఇప్పుడు జగన్‌ పక్కన దిగ్గజాలు కూర్చున్నారు. రాష్ట్రానికి వాస్తవిక పెట్టుబడులు తీసుకొస్తున్నారు’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు