CM Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ఓటేసిన సీఎం జగన్‌

శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ఓటు ముఖ్యమంత్రి జగన్‌తో వేయించాలన్న వైకాపా నాయకుల ప్రయత్నం ఫలించలేదు. అనూహ్యంగా ఆయన రెండో ఓటు వేయాల్సి వచ్చింది.

Updated : 24 Mar 2023 10:08 IST

ఈనాడు, అమరావతి: శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ఓటు ముఖ్యమంత్రి జగన్‌తో వేయించాలన్న వైకాపా నాయకుల ప్రయత్నం ఫలించలేదు. అనూహ్యంగా ఆయన రెండో ఓటు వేయాల్సి వచ్చింది.

తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌గా ఉన్న శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు చెప్పిన వివరాల ప్రకారం... ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కోసం అధికారులు 1 నుంచి 200 వరకు నంబర్లు గల బ్యాలెట్‌ పత్రాలను సిద్ధం చేశారు. ఒక్కో పుస్తకంలో 25 బ్యాలెట్‌ పత్రాలు ఉంటాయి. ముఖ్యమంత్రితో మొదటి ఓటు, అదీ ఒకటో నంబరు బ్యాలెట్‌ పత్రంపైనే వేయించాలన్నది వైకాపా నాయకుల ఆలోచన. ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులకు వారు అదే విషయం తెలియజేశారు.

కొందరు వైకాపా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కంటే ముందే శాసనసభకు చేరుకున్నా... జగన్‌ వచ్చి మొదటి ఓటు వేయడం కోసం పది నిమిషాలకుపైగా వేచి చూశారు. తీరా ముఖ్యమంత్రి వచ్చే సమయానికి...ఎమ్మెల్యేలకు బ్యాలెట్‌ పత్రాలు ఇచ్చే అధికారి వద్ద ఒకటో నంబరు బ్యాలెట్‌ పత్రంతో మొదలయ్యే పుస్తకం కాకుండా మరొకటి ఉంది. దాంతో ఆ అధికారి ఒకటో నంబరు బ్యాలెట్‌ పత్రంతో మొదలయ్యే పుస్తకం తెమ్మని సిబ్బందిని పురమాయించారు. దానికి తెదేపా పోలింగ్‌ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. ఆ హడావుడిలో.. ఎమ్మెల్యే కాసు మహేష్‌ వచ్చి మొదటి ఓటు వేసేశారు. సీఎం రెండో ఓటు వేయాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని