శివసేన పార్లమెంటరీ పార్టీ నేతగా గజానన్‌ కీర్తికర్‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా లోక్‌సభ ఎంపీ గజానన్‌ కీర్తికర్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న సంజయ్‌ రౌత్‌ను తొలగించారు.

Published : 24 Mar 2023 05:34 IST

సంజయ్‌ రౌత్‌ను తొలగించిన మహారాష్ట్ర సీఎం శిందే

దిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా లోక్‌సభ ఎంపీ గజానన్‌ కీర్తికర్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న సంజయ్‌ రౌత్‌ను తొలగించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌లకు శిందే లేఖలు పంపారు. పార్లమెంటు భవనంలోని మూడో అంతస్తులో ఉన్న శివసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కీర్తికర్‌ను గురువారం ఆ పార్టీ నాయకులు సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు