టీఎస్‌పీఎస్సీ సభ్యులందరినీ తొలగించాలి: భట్టి

లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నీళ్లు చల్లిందని, వెంటనే కమిషన్‌ సభ్యులందరినీ తొలగించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.

Published : 24 Mar 2023 05:34 IST

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నీళ్లు చల్లిందని, వెంటనే కమిషన్‌ సభ్యులందరినీ తొలగించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం ఝరి గ్రామం నుంచి గురువారం సాయంత్రం ప్రారంభించిన హాథ్‌ సే హాథ్‌ జోడో పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘ఉద్యోగాలు సాధించి సమాజంలో ఉన్నతంగా బతకాలని ఆశించిన నిరుద్యోగులను లీకేజీ వ్యవహారం భయాందోళనకు గురిచేసింది. ఇందుకు కారణమైన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులు, కార్యదర్శి, వారిని నియమించిన వారందర్నీ ప్రభుత్వం వెంటనే తొలగించాలి. లీకేజీ సర్వసాధాణమంటూ పలికిన ఇంద్రకరణ్‌రెడ్డి వంటి వారు మంత్రులుగా ఉండడం బాధాకరం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని సిట్‌ పిలవడం, అరెస్టుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోటీ పరీక్షలు పారదర్శకంగా జరిగేలా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పోరాటాలకు ప్రణాళిక సిద్ధం చేస్తాం. ప్రతిపక్షాల ఒత్తిడితోనే సీఎం కేసీఆర్‌ పంటనష్టంపై పరిశీలనకు బయటకు వచ్చారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. ప్రజలు కోరినట్లుగా మా పాలన ఉంటుంది’ అని భట్టి భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు