మత్స్యకారులకు అండగా ఉంటాం: కాంగ్రెస్‌

మత్స్యకారుల కుటుంబాలకు తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే హామీ ఇచ్చారు.

Updated : 25 Mar 2023 05:48 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మత్స్యకారుల కుటుంబాలకు తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే హామీ ఇచ్చారు. పీసీసీ ఫిషర్‌మన్‌ కమిటీ ఛైర్మన్‌ మెట్టుసాయి కుమార్‌ అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్‌లో ఆ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఠాక్రే మాట్లాడుతూ... ‘మత్స్యకారుల సమస్యలు తెలుసని, వారికి కాంగ్రెస్‌ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులను చేపల పంపిణీ పేరుతో మభ్య పెడుతోందని సాయికుమార్‌ ఆరోపించారు. మత్స్యకారులకు బీమా, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఠాక్రేకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో మత్స్యకారుల ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో వారికే టికెట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

యువజన కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి

తెలంగాణలో ప్రతి పోలింగ్‌ బూత్‌ నుంచి అయిదుగురు యువకులను యువజన కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని యువజన కాంగ్రెస్‌ జాతీయ ఇన్‌ఛార్జి కృష్ణ అలివేరు సూచించారు. ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వాల వైఫల్యాలపై నిరంతరం పోరాటాలు చేయాలని, ప్రతి బూత్‌ నుంచి అయిదుగురిని తీసుకుని యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. శివసేనారెడ్డి మాట్లాడుతూ... ఇప్పటికే ప్రక్రియ మొదలైందని, ఇప్పటివరకు 15% పూర్తి చేశామని, మరింత వేగవంతం చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని