జగన్‌ అరాచకాలు నచ్చకే ఎమ్మెల్యేల తిరుగుబాటు: రఘురామ

ముఖ్యమంత్రి జగన్‌ విధానాలు, అరాచకాలు నచ్చకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

Updated : 25 Mar 2023 09:02 IST

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి జగన్‌ విధానాలు, అరాచకాలు నచ్చకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన దిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా శాసనసభ్యులు బాధపడరని, మర్యాద ఇవ్వకపోతే మాత్రం బాధపడతారన్నారు. ‘ఎమ్మెల్యేలకు మర్యాద ఇవ్వవు.. అందర్నీ నువ్వు, నువ్వు అని పిలుస్తావు. నిన్ను మాత్రం ఎమ్మెల్యేలు సార్‌, మీరు అని పిలవాలా’ అని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. అవకాశం దొరికితే ఎవరైనా గూబ గుయ్యిమనిపిస్తారని, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే చేశారన్నారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనన్నారు. పులివెందులలో పులి అయిన జగన్‌మోహన్‌రెడ్డి.. ఉండి, భీమవరంల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే స్థానికులు చిత్తుచిత్తుగా ఓడిస్తారని రఘురామ అన్నారు. నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూ దిల్లీలో విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు మాత్రమే ఉంటారని విమర్శించారు. వారంతా లోపల ఉంటే ఎస్సీ, బీసీ ఎంపీలు బయట షెడ్డులో కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వైకాపా పరిస్థితి చిల్లుపడ్డ నావలా తయారైందని ఆయన విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని