జగన్‌కు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు అందవు

మరోసారి జగన్‌కు ఓటు వేసి అధికారం ఇవ్వకపోతే మహిళలకు ప్రభుత్వ పథకాలేవీ అందవని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Updated : 26 Mar 2023 09:06 IST

మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం, న్యూస్‌టుడే: మరోసారి జగన్‌కు ఓటు వేసి అధికారం ఇవ్వకపోతే మహిళలకు ప్రభుత్వ పథకాలేవీ అందవని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో వైఎస్‌ఆర్‌ ఆసరా మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ఇంటి ఇల్లాలిని ఈ ప్రభుత్వం శక్తిమంతురాలిగా చేసింది. గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఇవ్వలేకపోయాయి.  మరోసారి జగన్‌కు ఓటు వేయాలి. మీ ఆశీర్వాదం లేకపోతే అక్కచెల్లెమ్మలకు సహాయం చేయడం అనవసరమనే భావన సమాజంలోకి వెళ్తుంది.’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని