తిరుమలలో గంజాయి దొరకడం షాక్‌కు గురిచేసింది

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో గంజాయి దొరికిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 26 Mar 2023 04:39 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో గంజాయి దొరికిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘తిరుమలలో గంజాయి వార్త షాక్‌కు గురిచేసింది. రాష్ట్రంలో గంజాయి భూతం రోజురోజుకూ విస్తరిస్తోందనడానికి ఇదో సాక్ష్యం. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి అత్యంత ఆవేదన కలిగిస్తోంది. భక్తుల మనోభావాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలి’’ అని చంద్రబాబు శనివారం ట్వీట్‌ చేశారు. తిరుమల కొండపైకి అక్రమంగా గంజాయి తరలిస్తున్న పొరుగుసేవల ఉద్యోగికి సంబంధించిన వీడియోను ట్వీట్‌కు జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని