సంక్షిప్త వార్తలు(2)

డాక్టర్‌ అచ్చెన్న హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి, శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండు చేశారు.

Updated : 30 Mar 2023 06:08 IST

డా.అచ్చెన్న హత్య కేసు నిందితులను అరెస్టు చేయాలి: సీపీఎం

ఈనాడు, అమరావతి: డాక్టర్‌ అచ్చెన్న హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి, శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండు చేశారు. హంతకులతో సంబంధం ఉన్న ఉన్నతాధికారుల పాత్రపై సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు. దళిత ఉద్యోగులపై వేధింపులను అరికట్టేందుకు శాశ్వత ప్రాతిపదికపై కమిషన్‌ను నియమించాలని డిమాండు చేశారు.


1న ఓబీసీలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం: వీహెచ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓబీసీలను కించపరిచారని భాజపా కొత్తగా తెరపైకి తెచ్చిన అంశంపై చర్చించేందుకు ఏప్రిల్‌ 1న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని