అవినీతిపై మోదీ నీతులా?

అవినీతిపరులను దేశం దాటించేందుకు ప్రత్యేక పరారీ పథకం (భ్రష్టాచారీ భగావో అభియాన్‌) అమలు చేసిన మోదీ.. నీతులు చెబుతారా అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు.

Published : 30 Mar 2023 05:20 IST

అవినీతిపరులను దేశం దాటించిందెవరు?
ఖర్గే ధ్వజం

దిల్లీ: అవినీతిపరులను దేశం దాటించేందుకు ప్రత్యేక పరారీ పథకం (భ్రష్టాచారీ భగావో అభియాన్‌) అమలు చేసిన మోదీ.. నీతులు చెబుతారా అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు. అవినీతిపై పోరాట యోధుడిగా తనను తాను ప్రచారం చేసుకోవడం మానుకోవాలని మోదీకి హితవు పలికారు. భాజపా కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు అవినీతిపై తమ పోరాటానికి అడ్డుతగులుతున్నాయని మోదీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బుధవారం ఖర్గే స్పందించారు. ‘మోదీజీ.. అదానీ షెల్‌ కంపెనీల్లో రూ.20వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందెవరో చెప్పండి. లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీ, విజయ్‌ మాల్యా పెట్టారా? వీరేగా మీ ‘అవినీతిపరుల పరారీ పథకం’లో సభ్యులు. మీరు బృందానికి కన్వీనర్‌గా ఉన్నారా’ అని ఖర్గే నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని