రాష్ట్రంలో రావణ రాజ్యం

రాష్ట్రంలో రావణ రాజ్యం నడుస్తోందని, రూ.కోట్ల ప్రజాసంపదను ఖర్చు చేస్తూ ముఖ్యమంత్రి ప్రత్యేక విమానాల్లో దిల్లీకి తిరుగుతున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.

Published : 31 Mar 2023 04:35 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో రావణ రాజ్యం నడుస్తోందని, రూ.కోట్ల ప్రజాసంపదను ఖర్చు చేస్తూ ముఖ్యమంత్రి ప్రత్యేక విమానాల్లో దిల్లీకి తిరుగుతున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. దిల్లీలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని, మంత్రులను కలుస్తారని, కేసుల మాఫీ కోసమే అర్ధరాత్రి వేళ కేంద్ర హోంమంత్రిని కలుస్తారని విమర్శించారు. శ్రీరామనవమి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఏడాది ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణానికి హాజరై రాష్ట్రప్రభుత్వ పక్షాన పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవాల్లో పాల్గొనేవారని, సీఎం జగన్‌ మాత్రం దిల్లీలో నిర్మలా సీతారామన్‌ చుట్టూ అప్పుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. పాలకులు మంచివారైతే ఉత్తర్‌ప్రదేశ్‌ తరహాలో వ్యవస్థ బాగుపడుతుందని, పాలకులు సరైనవారు కాకపోతే ఆంధ్రప్రదేశ్‌లా మారుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని