రానున్న ఎన్నికల్లో వైకాపాదే విజయం

రానున్న ఎన్నికల్లో మళ్లీ వైకాపా విజయం సాధిస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Updated : 31 Mar 2023 10:36 IST

మంత్రి అంబటి రాంబాబు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో మళ్లీ వైకాపా విజయం సాధిస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని గురువారం మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. పోలవరం జలాశయం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్ల వరకు తగ్గిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేసినా తెదేపా అధినేత చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు