వైకాపాకు ఓటేయొద్దనేవారు మీ శత్రువులే: మంత్రి ధర్మాన

‘వైకాపాకు ఓటేయొద్దని చెప్పే ప్రతి వ్యక్తినీ మీ శత్రువుగానే గుర్తించాలి. అది భర్త అయినా.. కొడుకైనా వారి మాటలు నమ్మొద్దు.

Updated : 01 Apr 2023 10:44 IST

శ్రీకాకుళం కలెక్టరేట్, అర్బన్‌, న్యూస్‌టుడే: ‘వైకాపాకు ఓటేయొద్దని చెప్పే ప్రతి వ్యక్తినీ మీ శత్రువుగానే గుర్తించాలి. అది భర్త అయినా.. కొడుకైనా వారి మాటలు నమ్మొద్దు. మీపట్ల వారికి ద్వేషమో.. కోపమో.. ఉండటంతోనే అలా చెబుతున్నారని తెలుసుకోండి. దాని వెనుకవారి స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబసభ్యులు వేరొక పార్టీకి ఓటు వేయాలంటే అలాగే అని చెప్పి వైకాపాకు ఓటు వేయండి’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం టౌన్‌హాల్లో నిర్వహించిన ఆసరా నగదు పంపిణీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ప్రసంగం ప్రారంభానికి ముందే కొందరు మహిళలు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో మంత్రి అసహనానికి గురై గేట్లను మూసేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని