Ganta Srinivasa Rao: అప్పుల రాష్ట్రంలో సంపన్న సీఎం జగన్‌: గంటా

రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి సామాన్యుల జీవితాలు గాల్లో దీపాలుగా మారుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌ దేశంలోనే సంపన్నుడు అని చెప్పుకోవడానికి నవ్వాలో ఏడవాలో తెలియని దుస్థితి నెలకొందని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్వీట్‌ చేశారు.

Updated : 13 Apr 2023 10:00 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి సామాన్యుల జీవితాలు గాల్లో దీపాలుగా మారుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌ దేశంలోనే సంపన్నుడు అని చెప్పుకోవడానికి నవ్వాలో ఏడవాలో తెలియని దుస్థితి నెలకొందని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్వీట్‌ చేశారు. దేశంలోనే సంపన్న సీఎం పేదల పక్షాన పోరాడతాననడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్‌ అని విమర్శించారు.‘‘రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతుందని ఆశించడం ఈ ప్రభుత్వంలో నేరమే. అత్యంత సంపన్న సీఎంగా జగన్‌ రికార్డులకెక్కడం ద్వారా ఏపీ మరోసారి చర్చనీయాంశంగా మారడం బాధాకరం. 2004కి ముందు ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఎంత అనే చర్చకు పోవడం కూడా వృథానే’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు