KA Paul: రెండు వారాల్లో రూ.4వేల కోట్లిస్తా: కేఏ పాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Eenadu icon
By Politics News Desk Updated : 23 Apr 2023 09:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు కర్మాగారం కొనుగోలుకు రూ.42 వేల కోట్లకు బిడ్‌ వేస్తానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ పునరుద్ఘాటించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తన తండ్రి బర్నబాస్‌ను కలిసేందుకు శనివారం ఇక్కడకు వచ్చారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద స్థానికులను పలకరించి వారితో మాట్లాడారు. ‘బిడ్‌ వేసేందుకు కొన్ని లేఖలు అవసరం. ఆ లేఖలు ఇవ్వాలని అడుగుతున్నా. అవి ఇస్తే రెండు వారాల్లోనే రూ.4వేల కోట్లు ఇస్తా. విశాఖ ఉక్కు విలువ రూ.3.5 లక్షల కోట్లు. దాన్ని రూ.3,500 కోట్లకు అమ్మేద్దామని చూస్తున్నారు.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. దాన్ని అందరం కలిసి కాపాడుకోవాలి. ఇందులో భాగంగానే తెదేపా, వైకాపా, సీపీఐ నాయకులను కలిసేందుకు విశాఖపట్నం వచ్చా. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌ వేస్తానంటోంది. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు కేసీఆర్‌ మాట ఉంది. చంద్రబాబు రూ.5 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని జగన్‌కు అప్పగిస్తే.. ఈయన మరో రూ.4 లక్షల కోట్లు అప్పు చేశారు. నేను సీఎం అయితే అమరావతిలో ఆపేసిన భవనాలన్నింటినీ ఏడాదిలో కట్టేస్తా. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని కేఏ పాల్‌ పేర్కొన్నారు.


Tags :
Published : 23 Apr 2023 06:58 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు