Dharmana: వర్షాలు పడితే నీళ్లు చేరవా.. బురద కావా?జగనన్న కాలనీలపై ధర్మాన వ్యాఖ్యలు

‘జగనన్న కాలనీల్లో నీరు చేరింది.. వాగు పొంగింది అని ప్రతిపక్షాలు అంటున్నాయి. వర్షాలు పడితే నీళ్లు చేరవా? వాగులు పొంగవా? రహదారులు బురద కావా?’ అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

Updated : 29 Jul 2023 09:46 IST

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: ‘జగనన్న కాలనీల్లో నీరు చేరింది.. వాగు పొంగింది అని ప్రతిపక్షాలు అంటున్నాయి. వర్షాలు పడితే నీళ్లు చేరవా? వాగులు పొంగవా? రహదారులు బురద కావా?’ అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్షాలను ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని రేగులపాడులో కొత్తగా నిర్మించిన సచివాలయ భవనాన్ని శుక్రవారం ప్రారంభించిన మంత్రి అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే వల్ల పలు వివాదాలు పరిష్కారమవుతున్నాయన్నారు. ఇప్పటివరకు 27లక్షల ఎకరాల భూమిపై హక్కులు కల్పించినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వంలో ప్రతిఒక్కరికీ న్యాయం జరిగిందని.. విపక్షాలు ఏమీతోచక విమర్శలు చేస్తున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని