YSRCP: తిరువూరు వైకాపాలో మరోసారి బయటపడిన విభేదాలు

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు వైకాపాలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పురపాలక సంఘ సమావేశానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ మినహా సభ్యులంతా గైర్హాజరయ్యారు.

Updated : 31 Aug 2023 13:01 IST

తిరువూరు: ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు వైకాపాలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పురపాలక సంఘ సమావేశానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ మినహా సభ్యులంతా గైర్హాజరయ్యారు. తిరువూరు మున్సిపల్‌ కౌన్సిల్‌లో అధికార పార్టీకి 17 మంది సభ్యులు ఉండగా.. 16 మంది నేటి సమావేశానికి హాజరుకాలేదు. ఛైర్‌పర్సన్‌తోపాటు తెదేపాకు చెందిన ముగ్గురు సభ్యులు మాత్రమే వచ్చారు. కోరం పూర్తి కాకపోవడంతో ఛైర్‌పర్సన్‌ సమావేశాన్ని వాయిదా వేశారు. 

మున్సిపల్ ఛైర్మన్‌ పదవికి గతంలో నిర్ణయించిన ప్రకారం.. రెండేళ్ల ఒప్పందం అమలు చేయాలని ఇటీవల ఛైర్‌పర్సన్‌పై అసమ్మతి వర్గం సభ్యులు తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ నేపథ్యంలోనే వారంతా సమావేశానికి గైర్హాజరయ్యారు. అధికార పార్టీ సభ్యుల తీరుపై తెదేపా సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని