Dharmana Prasada Rao: సీఎం జగన్‌ మీద, నామీద కూడా కేసులు ఉన్నాయి: ధర్మాన

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్ర కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా భైరి గ్రామంలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు.

Updated : 18 Sep 2023 07:25 IST

శ్రీకాకుళం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్ర కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా భైరి గ్రామంలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తులో బయటపడింది. ప్రజాధనం తినేస్తే ఎవరినీ వదిలే ప్రసక్తి ఉండదు. దేశంలో చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది. సీఎం జగన్‌ మీద, నా మీద కూడా కేసులున్నాయి. మేం కూడా తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిందే. దీనికి ఎవరూ అతీతులు కాదు’ అని అన్నారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ సహాయంతో అంతా కలిసి కుట్రపూరితంగా జగన్‌ను దించేయాలని చూస్తున్నారన్నారు. అది అసాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపా 175 స్థానల్లో పోటీ చేస్తుందని, తెదేపా సైకిల్‌ గుర్తుపై 175 స్థానాల్లో పోటీ చేయగలదా అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని