Minister Dharmana: ఇక పోటీ చేయనని సీఎంతో చెప్పా: మంత్రి ధర్మాన

తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ముఖ్యమంత్రి జగన్‌తో చెప్పానని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Updated : 30 Sep 2023 07:40 IST

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ముఖ్యమంత్రి జగన్‌తో చెప్పానని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చా. 40 ఏళ్లుగా ఇందులోనే ఉన్నా. ఇక విశ్రాంతి తీసుకుంటా. నాకు సెలవు ఇప్పించండి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ముఖ్యమంత్రితో చెప్పా. పార్టీ కోసం చేస్తాను కానీ ఎక్కువ కష్టపడలేను. నన్ను వదిలేయమన్నా. దానికి ఆయన ‘అన్నా.. ఈ ఒక్కసారి పోటీ చేయండన్నా’ అని అడిగారు. 12 సార్లు ఎన్నికల్లో పోటీ చేశా. ఆరుసార్లు గెలిచా. ఆరుసార్లు ఓడిపోయా. గెలుపోటములతో పెద్ద తేడా ఉండదు. వచ్చే ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తే గెలిచి మీ సేవకుడిగా ఉంటా. ఓడిపోతే మీ స్నేహితుడిగా ఉంటా. నాకు ఈ గౌరవం, మర్యాద దక్కడానికి కారణం మీరే కాబట్టి ఈ విషయాలన్నీ మీకు చెబుతున్నా’ అని ప్రజలనుద్దేశించి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని